breaking news
government debt
-
ప్రభుత్వ రుణం రూ.60.66 లక్షల కోట్లు
త్రైమాసికంగా 2 శాతం డౌన్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.60.60 లక్షల కోట్లుగా నమోదయ్యింది. త్రైమాసికంగా చూస్తే (2016 డిసెంబర్తో ముగిసిన కాలానికి) రుణ భారం 2 శాతం తగ్గింది. మొత్తం రుణంలో అంతర్గత వాటా 92.6 శాతం ఉంది. డిసెంబర్ ముగింపు త్రైమాసికంలో ఈ పరిమాణం 92.7 శాతం. పెట్టుబడులకు సంబంధించి భారత్ రేటింగ్ పెంచకపోవడానికి దేశ రుణ భారమే కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు తరచూ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. తగ్గిన భారం...:అంతర్గత రుణ భారం పరిమాణంలో చూస్తే– రూ.56.15 లక్షల కోట్లుగా ఉంది. 2017 మార్చి నాటికి జీడీపీలో ఇది 37.3 శాతంగా ఉంది. 2016 డిసెంబర్ నాటితో చూస్తే– జీడీపీలో ఇది 38.9 శాతం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ దేశీయ స్థూల, నికర మార్కెట్ రుణ అవసరాలు వరుసగా రూ.5.82 లక్షల కోట్లు, రూ. 4.06 లక్షల కోట్లు ఉంటాయని అంచనావేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. గత ఏడాది ఈ మొత్తాలు వరుసగా రూ.5.85 లక్షల కోట్లు, రూ.4.40 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం డిసెంబర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది. రూపీ డినామినేడెడ్లో మార్కెట్లో ట్రేడయ్యే బాండ్లు, ట్రెజరీ బిల్స్ వాటా 85.3 శాతం నుంచి 85.7%కి ఎగసింది. అంతర్గత రుణం రూ.50,97,016 కోట్లని పేర్కొన్న ప్రభుత్వం, 2015 ముగిసిన జీడీపీ పరిమాణంతో 37.2 శాతంగా తెలిపింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 37.1%. కాగా మార్చి త్రైమాసికంలో ద్రవ్య లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. -
రెక్కలకష్టం ఆపేశారు
♦ కూలి డబ్బులకు లక్షన్నర మంది ఎదురుచూపు ♦ రూ.26 కోట్లు బకాయిపడిన సర్కారు ♦ నిధుల ఆలస్యంతో ఉపాధి పనులపై ప్రభావం ♦ పనులకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుముఖం గత నెల 29న ఉపాధి పనులకు 1.03 లక్షల మంది హాజరుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 75 వేలకు పడిపోయింది. నిధుల నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యంత్రాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లోనే బకాయిలు అధికం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కరువు కరాళ నృత్యంతో బతుకు బరువై.. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులివ్వకుండా సర్కారు పొట్టకొడుతోంది. ఎనిమిది వారాలుగా సుమారు లక్షన్నర మంది కూలీల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు రూ.26 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో జిల్లాలో ఈజీఎస్ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బకాయిలు పెరిగిపోవడంతో ఉపాధికి వచ్చే కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. దీంతో రైతులు కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు. ఈ క్రమంలో పనిదినాలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.06 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఈ సంఖ్య దాటిపోయింది. ఈ పనిదినాలను విశ్లేషిస్తే జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయవచ్చు. ఈ మండలాల్లో అధికం..! ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రబీ పంటల సాగు పడిపోయింది. దీంతో వ్యవసాయ కూలీలు సైతం ఉపాధి బాట పట్టారు. ఈ క్రమంలోనే జిల్లాలో రికార్డు స్థాయిలో పని దినాలు నమోదయ్యాయి. వ్యవసాయాధారిత ప్రాంతాలైన బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లో ఈజీఎస్ పనులు ముమ్మరంగా సాగాయి. అదే సమయంలో జిల్లాకు బకాయిపడిన రూ.26 కోట్లలో సింహభాగం ఇక్కడే చెల్లించాల్సివుంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా యాజ మాన్య సంస్థ (డ్వామా) 52,704 మందికి వంద రోజుల పనిదినాలను కల్పించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.89 లక్షల మంది జాబ్కార్డుదారుల్లో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి ఉపాధి చూపించారు. రెండు నెలలుగా కూలి డబ్బుల్లేవు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులివ్వలేదు. ఎట్టా బతకాలె. ఉపాధి పనులు చేసి పస్తులుండాల్సిన దుస్థితి. మాకు ఎనిమిది వారాలకు పైగా చేసిన పనులకు కూలి డబ్బులు రావాలి. ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకునేవారు లేరు. - మడ్డి యాదమ్మ, నక్కర్తమేడిపల్లి, యాచారం రెండు నెలలుగా ఇయ్యట్లే.. ఉపాధి హామీ పథకంలో రెండు నెలలు పనిచేసినం. ఇప్పటి వరకు కూలి డబ్బులు ఇయ్యలె. అసలే కరువు ఉంది.. ఈ యేడు ఎక్కడ కూడా పంటలు వెయ్యలె. కూలి చేయడం తప్ప వేరే బతుకుదెరువు లేదు. చేసిన పనులకు కూలి ఇవ్వండని ఎన్ని రోజులు అధికారుల సుట్టు తిరగాలె. వారం వారం ఇస్తామన్నారు.. ఎక్కడిస్తున్నారు? - చౌట వెంకటయ్య, అంతారం, కుల్కచర్ల మండలం ఎవ్వరూ పట్టించుకుంటలేరు.. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆరు వారాల కంటే ఎక్కువే అయింది. ప్రతి సోమవారం ప్రజాదర్బారులో అడుగుతున్నాం. ఉపాది సిబ్బంది తీరు బాగా లేదు. ఇలాగైతే ఎలా.. పెద్ద సార్లు పట్టించుకొని తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించాలె. - ఆంజనేయులు, మాలసోమారం, బంట్వారం మండలం