రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌.. విరూపాక్షికి పరామర్శ | Jagan Heads to Kurnool Tomorrow To Stand by MLA Virupakshi | Sakshi
Sakshi News home page

రేపు కర్నూలుకు వైఎస్‌ జగన్‌.. విరూపాక్షికి పరామర్శ

Aug 12 2026 11:24 AM | Updated on Aug 12 2026 11:56 AM

Jagan Heads to Kurnool Tomorrow To Stand by MLA Virupakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (ఆగస్టు 13, 2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి పరామర్శించనున్నారు.

పర్యటనలో భాగంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్‌ జగన్‌ బయలుదేరుతారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్‌ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి మాట్లాడనున్నారు. 

విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు. స్థానిక నేతలతోనూ మాట్లాడనున్నారు. ములాఖత్‌ అనంతరం.. వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వైఎస్‌ జగన్‌ కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విరూపాక్షి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వైఎస్‌ జగన్‌ పర్యటనలకు పోలీసుల ఆంక్షల పేరిట అడ్డుతగులుతున్న కూటమి ప్రభుత్వం.. రేపు అదే పంథాను కొనసాగించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement