breaking news
kurnool visit
-
జయహో జగన్
జగన్ రాకే ఒక ప్రభంజనం... జన సందోహాలు, జనసంద్రాలే నిదర్శనం.. పరామర్శకెళ్లినా..పలకరింపునకు వచ్చినా ప్రజా సమూహాలకు పరమానందం.. ఆయన్ను చూడాలని, ఆయన మాట వినాలని పరితపించే హృదయాలకు హృద్యమమే.. సంద్రంలా కదిలివచ్చే తీరు ఉత్తుంగ తరంగమేహృదయ సంగమమే వీడని బంధంలా.. వదులుకోలేని అనుబంధంలా పెనవేసుకున్న ప్రేమానురాగాల్లా కళ్లను కట్టిపడేసే జన‘సిత్రాలు’ఎన్నో ఎన్నెన్నో... మా మనవడే వచ్చాడంటూ అవ్వృతాతలు.. నా బిడ్డే కదిలి వచ్చాడని అమ్మలు..మా తమ్ముడే తరలివస్తున్నాడని అక్కలు మా అన్నే వచ్చాడంటూ విద్యార్థులు..మా మార్గదర్శి వెంటేనంటూ జెన్ జీ తరం... పోటెత్తే సింధువులో బిందువుల్లా...రేపటి ఉద్యమానికి వారధుల్లా... జయ జయహో జగన్ అంటూ ప్రణమిల్లిన తీరుతో కర్నూలు పర్యటన యావత్తూ మురిసి మెరిసే.. కర్నూలులో ‘జెన్ జీ’ జోష్.. జగన్ వెంట కదం తొక్కిన యువత... వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో పెద్ద సంఖ్యలో యువత కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాదిగా యువకులు బైకులపై కదం తొక్కారు. నన్నూరు, నన్నూరు టోల్‌ప్లాజా, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, చెన్నమ్మ సర్కిల్, సంతోష్ నగర్ కూడళ్లు యువత సందడితో హోరెత్తాయి. కేరింతలు, జై జగన్.. జై జై జగన్ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. ఓ వైపు చేతుల్లో ప్లకార్డులు.. మరోవైపు బైక్‌లపై జగన్ కాన్వాయ్ వెంట ఉత్సాహంగా యువకులు సాగారు.. ‘ఇంటికో ఉద్యోగం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి’ హామీల అమలుపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొందరు యువకులు ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో ‘జగన్ నువ్వే మా దిక్కు.. నువ్వే మాకు భరోసా’ అంటూ మరికొందరు ప్లకార్డులను ప్రదర్శించారు. సోషల్‌మీడియాలో చురుగ్గా కనిపించే నేటి ‘జెన్ జీ’ తరం భారీగా రోడ్డెక్కడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనలో యువత చూపిన ఉత్సాహం.. వారిలో ఆయనకు ఉన్న ఆదరణను చాటిందని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుందిములాఖత్లో ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ భరోసాఎమ్మెల్యే భార్య, చిన్న కుమారుడికి ధైర్యం చెప్పిన జననేత కర్నూలు (సెంట్రల్): అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గురువారం జిల్లా జైలులో ములాఖత్‌లో విరూపాక్షి, ఇతర నాయకులను వైఎస్ జగన్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, విరూపాక్షి భార్య రామాంజనమ్మలతో సహా కలిశారు. వైఎస్ జగన్ విరూపాక్షితో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ఇతర నాయకులకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం జైలు వెలుపల విరూపాక్షి భార్య రామాంజనమ్మ, చిన్నకుమారుడు లక్ష్మీనారాయణలతో కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. విరూపాక్షి కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందించాలని పార్టీ నాయకులను జగన్ ఆదేశించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్య పడవద్దని, అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. అడుగడుగునా ఆంక్షలు.. బారికేడ్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి జనం వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. అయినా ఖాతరు చేయకుండా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జనాన్ని అడ్డుకున్నారు. దాదాపు 200 వాహనాలను నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం రేడియో స్టేషన్ల వద్ద చెక్‌పోస్టులు పెట్టి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదోని, ఆలూరు నుంచి రాకుండా అడ్డుపడ్డారు. తనిఖీల పేరుతో జనాన్ని నిలిపివేశారు. దేవనకొండ, వెల్దుర్తిల వద్ద చెక్‌పోస్టులు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం, కర్నూలు టౌన్, రిలయన్స్ మార్ట్ ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు దగ్గర చెక్‌పోస్టు పెట్టి నిలువరించారు. నంద్యాల ప్రాంతం నుంచి రాకుండా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి జిల్లా జైలు వరకు వేలాదిమంది పోలీసులను మోహరించారు. బెంగళూరు–హైదరాబాద్ హైవే పైకి ఎక్కే ప్రాంతంలో చెక్‌పోస్టులను పెట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. -
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్ర
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూరంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.కఠిన చర్యలు ఉంటాయ్: ఎస్పీజిల్లాలో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్‌షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆంక్షలపై వైఎస్సార్సీపీ మండిపాటుములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్‌ను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్‌కు దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, బారికేడ్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే.. అభిమానాన్ని ఆపలేరుజగన్ పర్యటనలకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్‌ను కలిసేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలివస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన కూడా విజయవంతమవుతుందని అంటున్నారు. జగన్ భద్రతపై ఆందోళనమాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. భద్రతా అంశాలు, పోలీసుల ఆంక్షలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్.. విరూపాక్షికి పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (ఆగస్టు 13, 2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి పరామర్శించనున్నారు.పర్యటనలో భాగంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి మాట్లాడనున్నారు. విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు. స్థానిక నేతలతోనూ మాట్లాడనున్నారు. ములాఖత్ అనంతరం.. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వైఎస్ జగన్ కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.విరూపాక్షి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వైఎస్ జగన్ పర్యటనలకు పోలీసుల ఆంక్షల పేరిట అడ్డుతగులుతున్న కూటమి ప్రభుత్వం.. రేపు అదే పంథాను కొనసాగించే అవకాశం లేకపోలేదు. -
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
కర్నూలులో పవన్‌కు నిరసన సెగ
కర్నూలు/కర్నూలు టౌన్: కర్నూలు పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. బుధవారం కర్నూలు పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు జేఏసీ నాయకులు కలెక్టరేట్ వద్ద నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు ర్యాలీగా వెళ్లారు. అయితే గాంధీ విగ్రహం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి సిగ్గులేకుండా పోలీస్ బలగాలతో బాలిక కేసును అడ్డుపెట్టుకుని కర్నూలుకు వచ్చారని మండిపడ్డారు. ఆయనకు అమరావతిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని దుయ్యబట్టారు. కాగా, జేఏసీ నేతలతో పాటు మరో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. మరోవైపు పవన్ సభలో ప్రసంగిస్తుండగా న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకొని వస్తుండగా పోలీసులు అడ్డుకుని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..
సాక్షి, కర్నూలు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనను విద్యార్థి, న్యాయవాదుల జేఏసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వికేంద్రీకరణకు పవన్ మద్దతు తెలిపిన తరువాతే రాయలసీమలో అడుగు పెట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని విద్యార్ధి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాగా నేటి నుంచి రెండు రోజులు పవన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి, కోట్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ ప్రసంగించనున్నారు. -
'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీపీ రాముడు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. నకిలీ మావోయిస్టులు ఎక్కువయ్యారని డీజీపీ వ్యాఖ్యానించారు. ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు తెలిపారు.


