
సాక్షి, కర్నూలు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనను విద్యార్థి, న్యాయవాదుల జేఏసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వికేంద్రీకరణకు పవన్ మద్దతు తెలిపిన తరువాతే రాయలసీమలో అడుగు పెట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని విద్యార్ధి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాగా నేటి నుంచి రెండు రోజులు పవన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులు, శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించి, కోట్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ ప్రసంగించనున్నారు.