తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్‌డేట్స్
విజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాం
- తమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
- తమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలు
- సీపీఐ రెండు, సీపీఎం 2
- ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తి
- విజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలు
- ఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులు
- డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!
- తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే
- అధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్
- ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలు
కీలకంగా ఆ పార్టీలు?
- తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు
- 108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే
- డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపు
- మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికే
- రెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరిన విజయ్
- గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖ
- కీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు
- తమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు
- ఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలు
- ఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1
- కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలు
ఏం తేలుస్తారో?
- టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడి
- తమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులు
- ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్
- టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్
విజయ్ వెంట ఎవరెవరు?
- ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం
- లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే
- మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరం
- విజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠ
- అన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలు
- నేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్
- ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!
ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి!
- తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి స్టాలిన్
- ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకే
- మరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం
- కొలతూర్‌లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్
- చెపాక్‌లో తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్ విజయం
- ప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్
కాంగ్రెస్‌తో సెంగోట్టయన్ చర్చలు!
- తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలు
- విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?
- ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీ
- కాంగ్రెస్‌తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలు
- ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్
లోక్‌భవన్‌కు విజయ్?
- తమిళనాడు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్
- టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్
- శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకే
- సమావేశం తర్వాత నేరుగా లోక్‌భవన్‌కు దళపతి?
- ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశం
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకే
- తమిళనాడులో హంగ్
- మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్లు తక్కువ!
- ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?
- మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠ

నేడు టీవీకే కీలక సమావేశం
- విజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశం
- నెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్‌కు ఆహ్వానించిన విజయ్
- ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశం
- ఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్

విజయ్ నివాసం వద్ద కోలాహలం
- చెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలం
- భారీగా పోలీసు భద్రత ఏర్పాటు
- విజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులు
- మరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులు
- విజయ్‌కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
- టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలు
మొదలైన సంప్రదింపులు
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు
- ఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులు
- అందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?
- ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
- పీఎంకే నుంచి మరో నలుగురు
- వామపక్షాల సంఖ్య 2,
- ఐయూఎంఎల్ 2
- విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠ
- అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చ

మరో 11 సీట్ల దూరంలో..
- ఉత్కంఠగా తమిళనాడు రాజకీయం
- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే
- 234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయం
- డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపు
- మ్యాజిక్ ఫిగర్ 118
- ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరం
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..

ఓటమిపై స్పందించిన స్టాలిన్
- ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్
- ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్
- ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్
- దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేత
- కొలతూర్‌లో స్టాలిన్ ఓటమి
- స్టాలిన్‌ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు
- విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్‌ను ఎద్దేవా చేసిన బాబు

విజయహో..
- మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్
- తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళం
- డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకే
- తొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు
- 234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే
- పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్
- డీఎంకే కూటమి దారుణ ఓటమి
- డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమి
- మొత్తం మంత్రులంతా ఓటమి
- మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమి
- మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్
- తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్


