
'అన్నదాత పోరు', నిరసనలు, ర్యాలీలకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పోలీసులు అమల్లోకి తెచ్చారు.
యూరియా పై వైసిపి తలపెట్టిన నిరసనతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైంది. పోలీసులను ఉపయోగించి వైసిపి నిరసనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వ యత్నం. రేపు వైసిపి తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం పై పోలీసుల ఆంక్షలు. అన్నదాత పోరు నిర్వహణకు, ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. నిరసనలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీ వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్‌సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి.