పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి, ఇతర పోస్టులను సృష్టిస్తూ 2020 సెప్టెంబర్ 30న అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై నివ్వెరపోతున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు
ఎంపీడీవోలకు తొలిసారి పదోన్నతులిచి్చనట్లు పవన్ చెప్పడంపై విస్మయం
వాస్తవానికి వైఎస్ జగన్ పాలనలోనే ఎంపీడీవోలకు భారీగా పదోన్నతులు
డివిజన్ స్థాయిలో ఆర్డీవోల తరహాలో డీఎల్‌డీవో వ్యవస్థ ఆలోచనకు కార్యరూపం
సాక్షి, అమరావతి: ఎంపీడీవోల పదోన్నతులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసి పంచాయితీరాజ్ శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. సీనియారిటీ జాబితా విషయంలో తీవ్ర వివాదాలు, కోర్టు కేసులతో దాదాపు 35 ఏళ్లు పదోన్నతులు లేక, ఉద్యోగంలో చేరిన బాధ్యతల్లోనే రిటైర్ అవుతాం అని ఎంపీడీవోలు వ్యథ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో 2020లో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోల పదోన్నతులకు చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేసింది.
సీరియారిటీ జాబితా వివాద పరిష్కారానికి ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవో తరహాలో కొత్తగా డీఎల్‌డీవో (డీడీవో) పోస్టును ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలతో సమన్వయం కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇలా... మూడున్నర దశాబ్దాలుగా పదోన్నతులకు నోచని ఎంపీడీవోలకు అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఒకేసారి ప్రమోషన్లు కల్పించారు వైఎస్ జగన్. ఇలా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి వ్యవస్థ ఆలోచన చేయడమే కాక దానిని కార్యరూపంలోకి తెచ్చారు. వాస్తవం ఇది అయితే డిప్యూటీ సీఎం పవన్... ఎంపీడీవోలకు తొలిసారి తామే పదోన్నతులు కల్పించినట్లు వ్యాఖ్యానించడంపై ఆ శాఖ అధికారులే విస్తుపోతున్నారు.
డీఎల్‌డీవో (డీడీవో) కార్యాలయాలనూ బాబు సర్కారే ప్రారంభించినట్లు పవన్ చెప్పడంతో అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ కార్యాలయాలు రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో 2020 సెపె్టంబర్ తర్వాత నుంచే కొనసాగుతుండడం గమనార్హం. ఇక డీడీవో కార్యాలయాలు కూడా కూటమి ప్రభుత్వం కొత్తగా నిరి్మంచిన భవనాలేవీ కాదు. గ్రామ సచివాలయ భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. పలుచోట్ల కింద అంతస్తులో గ్రామ సచివాలయం, పైఅంతస్తులో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుకు కేటాయించారు.
ఆ ఒక్క చారిత్రక నిర్ణయంతో...
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ విషయంలో తీసుకున్న ఆ ఒక్క చారిత్రక నిర్ణయంతో ఆ శాఖ ఉద్యోగులకు భారీగా మేలు జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంపీడీవోల పదోన్నతులకు వీలు కల్పించడంతో కిందిస్థాయిలోని ఈవోపీఆర్‌డీ, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5... ఒకరివెంట ఒకరికి పదోన్నతులకు వీలు కలిగింది. కిందిస్థాయి కేడర్‌లోనూ సీనియారిటీ జాబితాల వివాదాలు పరిష్కరించి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2024 మార్చిలో పంచాయతీ సెక్రటరీలకు ప్రమోషన్లు కల్పించింది. ఎన్నికల అనంతరం బాబు సర్కారు మరికొందరికి పదోన్నతులు ఇచి్చంది. తమ ప్రభుత్వం ఒకేసారి శాఖలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించినట్లు పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందని పంచాయతీరాజ్ ఉద్యోగులే అంటున్నారు.


