ఇళ్ల కూల్చివేత బాధితులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
వైఎస్ జగన్‌ను కలిసిన ఇళ్ల కూల్చివేత బాధితులు
అన్యాయంగా నేలమట్టం చేశారని ఆవేదన
సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదని కన్నీటిపర్యంతం
వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తానన్న జగన్
అధైర్య పడొద్దని, న్యాయ సహాయం అందిస్తామని భరోసా
సాక్షి, అమరావతి: విజయవాడలోని జోజినగర్‌లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
పక్కా రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిరి్మంచుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజి్రస్టేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.
అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.
పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట
చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామా న్లు బయటకు తీసుకొచ్చే సమయమూ ఇవ్వకుండా నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా ఏమాత్రం కనికరం చూపలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే మా ఇళ్లను నేలమట్టం చేసినట్లు మమ్మల్ని కూడా నేలమట్టం చేస్తామని టీడీపీ నేత సురక శ్రీనివాసరావు బెదిరించారని బాధితురాలు అరుణ వాపోయారు.
ఇళ్లు కూల్చేయడంతో చెట్టు కింద ఉంటున్నామని బాధితురాలు తంగా సుబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం కుదువ పెట్టి, పైసాపైసా కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెప్పా రు. శ్రీ లక్ష్మీ రామ కో–ఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారని విజయలక్ష్మి అనే బాధితురాలు మండిపడ్డారు. వైఎస్ జగన్ భరోసాతో ధైర్య మొచ్చిందని బాధితులు లలిత కుమారి, లక్ష్మణ్ తదితరులు అన్నారు.


