breaking news
Victims Familes
-
భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్‌ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్‌ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు. -
భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్
-
చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
-
విజయవాడలో ఉద్రిక్తత.. సుజనాచౌదరి ఆఫీస్ ముట్టడి
సాక్షి, విజయవాడ: భవానీపురంలో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ఇంటి ముందు బాధితులు బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని భవానీపురం బాధితులు కోరుతున్నారు. నిన్న విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. తక్షణమే కూల్చివేతలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్డర్ కాపీ అందేలోపే ఇళ్లను అధికారులు కూల్చేశారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు విలపిస్తున్నాయి.విజయవాడలో ఇళ్ల కూల్చివేత దారుణమని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇందులో పలువురు నేతల హస్తం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పోతిన మహేష్ అన్నారు.బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌ను బాధితులు ముట్టడించారు. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫ్లాట్స్‌ను అన్యాయంగా కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కూల్చొద్దని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అన్యాయంగా మా ఫ్లాట్లను కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై ఎంక్వయిరీ చేయాలి. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వద్దకు కూడా వెళ్తామని బాధితులు అన్నారు. -
భవిష్యత్తు అగమ్య గోచరం
హాంకాంగ్: హాంకాంగ్‌లోని అపార్టుమెంట్ సముదాయంలో బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 128 మందిని బలి తీసుకుంది. మరో 200 మంది వరకు జాడ తెలియడం లేదు. హాంకాంగ్‌లోని మొత్తం 75 లక్షల జనాభాకు గాను ప్రమాదం జరిగిన శివారు టై పొ టౌన్లోనే 3 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. 1948 తర్వాత హాంకాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదమిది. 1980ల్లో నిర్మించిన వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ సముదాయంలో 4,600 మంది ఉన్నట్లు అంచనా. తాజా విషాద ఘటనలో 32 అంతస్తులున్న ఈ కాంప్లెక్స్‌లో పైఫ్లోర్లలో ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం పడింది. మొత్తం 8 అపార్టుమెంట్లకుగాను ఏడు అపార్టుమెంట్లలో దాదాపు 40 గంటలపాటు మంటలు మండుతూనే ఉన్నాయి. విలియం లి కుటుంబం సురక్షితంసెప్టెంబర్ నెలలో తమ అపార్టుమెంట్‌లోని 29వ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్‌కు మారిన విలియం లి కథ సుఖాంతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుటుంబంలోని మిగతా ముగ్గురూ ఆ సమయంలో వేర్వేరు పనులపై బయటే ఉన్నారు. విలియం లి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న అపార్టుమెంట్లోకి తిరిగి వెళ్లడం అసాధ్యం, మరి ప్రభుత్వం తమను ఎలా ఆదుకుంటుందన్న ఆలోచన ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన రోజు ఏమైందంటే.. ఆ రోజు సాయంత్రం విలియం లికి సెలవు. బయటకు వెళ్లాలని అనుకుంటుండగా ఎన్నడూ లేంది సాయంత్రం 3 గంటలప్పుడు భార్య నుంచి ఫోన్ వచ్చింది. తమ అపార్టుమెంట్‌ను మంటలు చుట్టుముట్టాయని ఓ స్నేహితురాలు చెబితే ఫోన్ చేశానంది. లి నమ్మలేదు. అంతా బాగానే ఉంది. పొగ లేదు, మంటలూ లేవు ప్రమాదం లేదంటూ బదులిచ్చారు. దాదాపు 8 నిమిషాల తర్వాత ఆయన డోర్ తెరిచి చూశారో లేదో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అంతా నల్లగా కనిపించింది. అప్పుడు ఆయన ప్రమాదం శంకించారు. హాల్లోకి వెళ్లి చూశారు. పొగ తీవ్రతకు తాళ లేక తిరిగి తన ఫ్లాట్‌లోకి వచ్చేశారు. ఇక తనకు మృత్యు ఘడియలు దగ్గర పడినట్లేననుకున్నారు. ఆ తర్వాత కారిడార్ గుండా వెళ్లేందుకు యత్నించారు. అక్కడ ఇద్దరు వృద్ధులున్నారు. ఈలోగా ఫైర్ ఫైటర్లు నిచ్చెన అందించడంతో ముందుగా ఇద్దరు వృద్ధులు కిందికి దిగేందుకు సాయం చేశారు. ఆ తర్వాత ఫైర్ ఫైటర్లు పంపిన నిచ్చెనపైకి ఎక్కారు. కిందికి దిగేలోపు మంటలను ఆయనను దహించి వేయకుండా నీళ్లు చిమ్ముతూనే ఉన్నారు. ఎలాగోలా కిందికి చేరుకున్న లి సజీవంగా బయటపడినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడే తన కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న భార్య, కూతురు, కుమారుడు కనిపించారు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. ‘మాలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న హాంకాంగ్ ప్రజలకు కృతజ్ఞతలు’అని ఈ కుటుంబం అంటోంది.మా భవిష్యత్తు ఎలా ఉంటుందో..?ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లిన 70 ఏళ్ల చాన్ తాముండే వాంగ్ ఫుక్ కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. భారీగా వ్యాపిస్తున్న మంటలను దూరం నుంచి చూసి షాకయ్యారు. అలా చూస్తూ ఉండటం మినహా చేయగలిగిందేమీ లేకుండాపోయింది. ఇలాంటి ప్రమాదాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆమె తెలిపారు. అదృష్టవశాత్తూ ఆమె భర్త ఐఎన్ కాంగ్ ఆ సమయంలో ఇంట్లో లేరు. చాన్, కాంగ్ వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తుంటారు. దాదాపు పదేళ్లుగా ఉంటున్న ఆ ఇల్లు ఇప్పుడు నివాస యోగ్యంగా ఏమాత్రం లేదు. ఇప్పుడిక ఏం చేయడమా అన్న ఆలోచన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం వారిని ప్రస్తుతం ఓ హోటల్లో ఉంచింది. ‘రెండు రోజులుగా నాకు నిద్రపట్టడం లేదు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. ఏంచేయాలి? ఇవే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలు’అని చాన్ అంటున్నారు. ‘ప్రభుత్వం అత్యవసర సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల నుంచి కూడా వస్తువులు, డబ్బు అందుతూనే ఉన్నాయి. అయితే, భవిష్యత్తు జీవితానికి అవి ఏమాత్రం అక్కరకు వస్తాయనేది తెలీడం లేదు’అని తెలిపారు. -
Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం
-
లైంగిక దాడి బాధితులకు పరిహారం ఇప్పించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారం, లైంగిక దాడి కేసుల్లో అవసరమని భావించిన పక్షంలో బాధితులకు పరిహారం కూడా చెల్లించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం సెషన్స్ కోర్టులు, పోక్సో కోర్టులను ఆదేశించింది. ఈ విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదే వన్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా)ను ఆదేశించింది.అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపు కారణంగా అత్యాచార బాధితులకు న్యాయపరంగా దక్కాల్సిన పరిహారం దక్కడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 25 ఏళ్ల మానసికలోపం కలిగిన బాధితురాలికి సీఆర్పీసీలోని 357ఏ ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని అధికారులు నిరాకరిస్తున్నారని పిటిషన్‌దారు పేర్కొన్నారు. ఈ విషయంలో సెషన్స్ కోర్టులు లేదా స్పెషల్ కోర్టులు సరైన ఆదేశాలివ్వకపోవడం, అవగాహన లోపమే ఈ పరిస్థితికి కారణమని ధర్మాసనం తెలిపింది. -
Chevella Bus Incident: ప్రాణం పోవడం ఖాయమనుకున్నా
చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచి్చనట్లుగా ఉందని, షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది. నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. తలచుకుంటేనే భయంగా ఉంది బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది. – బస్వరాజ్, కోకట్ ప్రాణాలు పోతాయనుకున్నా.. నగరంలో స్వీపర్‌గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉన్న బ్యానెట్‌పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్‌కు చెప్పా. డ్రైవర్ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా. – నాగమణి, ధారూరు రైలు మిస్సు కావడంతో.. హైదరాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచి్చనా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేశాడు. కానీ టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు. – బి.శ్రీనివాస్, తాండూరు కంకరలో కూరుకుపోయా.. మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు నిండిపోవడంతో నిలబడి ఉన్నా. కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్‌కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను. – అనసూయ, బోంగుపల్లి ఏం జరిగిందో అర్థం కాలేదు వికారాబాద్‌లో ఉంటూ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచి్చంది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి. – ఆర్.అఖిల్, పూడూరు -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్‌లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.


