breaking news
Annadata Poru
-
ఏపీలో కదం తొక్కిన రైతులు (ఫొటోలు)
-
Anakapalle: ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు
-
‘అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు. అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు. -
యూరియా కొరత, రైతు సమస్యలపై YSRCP పోరుబాట
-
Annadata Poru 2025: ఈనాడు, ABN పైన కేసు పెట్టు..
-
ఏపీలో రోడ్డెక్కిన అన్నదాత
-
Guntur: దుమ్మురేపిన అంబటి ర్యాలీ
-
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
YSRCP Annadata Poru: పులివెందులలో అన్నదాత పోరుకు భారీగా తరలివస్తున్న రైతులు
-
ఒకవైపు రైతులు అల్లాడుతుంటే 500 కోట్లతో బాబు సభ
-
YSRCP Annadata Poru: కదం తొక్కిన రైతన్నలు.. ఖబర్దార్ బాబు
-
పోలీసులా లేక రౌడీలా.. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి
-
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
-
YSRCP అన్నదాత పోరుపై పోలీస్ ఆంక్షలు
-
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
నేడు 'అన్నదాత పోరు'కు YSRCP శ్రేణులు సన్నద్ధం
-
Annadata Poru: నేడే రైతన్న రణభేరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికంకూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి. సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’.. రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు.. ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.అన్నదాత కన్నెర్రతో కలవరం..అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు. -
కాడి వదిలి రోడ్డెక్కి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు! టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది. ఆంక్షలతో ‘కట్ట’డి.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఏలూరు డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు 15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..! అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. మరొక పక్క 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్‌లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. -
'అన్నదాత పోరు' కార్యక్రమంపై కూటమి ప్రభుత్వ ఆంక్షలు
'అన్నదాత పోరు', నిరసనలు, ర్యాలీలకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పోలీసులు అమల్లోకి తెచ్చారు.యూరియా పై వైసిపి తలపెట్టిన నిరసనతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైంది. పోలీసులను ఉపయోగించి వైసిపి నిరసనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వ యత్నం. రేపు వైసిపి తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం పై పోలీసుల ఆంక్షలు. అన్నదాత పోరు నిర్వహణకు, ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. నిరసనలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.ఏపీ వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు