రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders Comments On Farmers Problems In Chandrababu Govt In Annadata Poru Protests, More Details Inside | Sakshi
Sakshi News home page

రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్‌సీపీ

Sep 9 2025 12:32 PM | Updated on Sep 9 2025 3:23 PM

Ysrcp Leaders Comments On Farmers Problems In Chandrababu Govt

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్‌సీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్‌జగన్‌ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.

అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్‌ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్‌సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.

యూరియా కొరత, రైతు సమస్యలపై YSRCP పోరుబాట

ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.

తిరుపతి: అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.

చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు

ఎన్టీఆర్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ..  యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement