సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, మరోవైపు పండుగల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు.
సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఆర్.గోపాలకృష్ణన్ శుక్రవారం స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లను పరిశీలించిన అనంతరం ఆయన ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
అలాగే సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పండుగ సీజన్ కోసం గ్రేడెడ్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అభివృద్ధి చేశారు. ప్రయాణికులు, వాహనాల కదలిక, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వినియోగం, రద్దీ ఎక్కువగా ఉండే వేళలను అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహించి ట్రాఫిక్ అధ్యయనం చేసినట్లు డీఆర్‌ఎం వివరించారు.
సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సగటున 1.34 లక్షలు మంది రాకపోకలు సాగిస్తారు.పండుగల దృష్ట్యా ప్రస్తుతం 1.84 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
గేట్ 2, గేట్ 4 వద్ద కొత్త హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.రెతిఫైల్ బస్‌స్టేషన్ వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తెరిచారు.
సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5 తెరిచినట్లు అధికారులు వివరించారు.
రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్‌లను ఏర్పాటు చేశారు.
92 కెమెరాలతో పటిష్టమైన సీసీటీవీ నిఘా, 17 టికెటింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు.
24 గంటల పాటు వార్ రూమ్‌ల నిర్వహణ కొనసాగుతుంది.


