కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.


