
సాక్షి అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అలాంటిది ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
టీడీపీ గెలుపుపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ గురువారం నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంపైన సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. భారీ ఎత్తున దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలీసుల అండతోనే టీడీపీ గెలిచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.