రుచికరంగా..ఆరోగ్యంగా తిందాం ఇలా..! | Boost Flavor Without Extra Salt or Sugar – Try Umami for Healthy, Satisfying Meals | Sakshi
Sakshi News home page

టేస్ట్‌ని మిస్‌ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!

Sep 16 2025 1:44 PM | Updated on Sep 16 2025 3:32 PM

Health Tips: What is Umami It could be beneficial for health

ఆరోగ్యంగా తినాలంటే ఉప్పు , గ్లూకోజ్‌ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ మన నాలుక టేస్ట్‌ కావాలంటూ..పోషకాలు లేని ఆహారంవైపే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా నూనెలో డీప్‌ ఫ్రై చేసి, అధికం సోడియంతో ఉండే వాటినే మనసు కోరుకుంటుంది. ఊబకాయం, డయాబెటిస్‌, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకూడదంటే చక్కెర, ఉప్పు తగ్గించడం తప్పనిసరి. మరి ఇలా నాలుకను కట్టేసేలా టేస్ట్‌ లెస్‌గా తినడం అందరి వల్ల కాదు. అలాంటప్పుడు ఇలా తెలివిగా రుచిని మిస్‌ కాకుంకా, పోషకాలు పోకుండా ఆరోగ్యంగా తినాంటే ఇలా ట్రై చేయండని చెబుతున్నారు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జమునా. మరి అదెలాగో తెలుసుకుందామా..!.

రుచిని కోల్పోకుండా సంతృప్తికరంగా తినాలనకుంటే ఉమామి రుచి బెస్ట్‌ అంటున్నారామె. అదేం రుచి అంటే..ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది  ఒక డిష్‌ని ఎలివేట్‌ చేసేలా రిచ్‌నెస్‌, ఫుల్‌నెస్‌ కూడిన ఒక విధమైన రుచి. 

అంటే ఉప్పు తక్కువగా ఉన్న మంచి టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చప్పిడి భోజనం తిన్నామనే ఫీల్‌ రాదట. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్‌, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. 

ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్‌ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే తక్కువ సోడియం ఉన్న ఆహారాలకు ఉమామి రుచిని పెంచే పదార్థాలను జోడిస్తే..ఆహారం రుచికరంగా మారుతుంది, ఆరోగ్యకరంగా తినే అవకాశం ఉంటుందని జపన్‌ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో అధికంగా ఉండే గ్లూటామేట్‌ సంతృప్తిని అందించి, స్నాక్స్‌ అవసరాన్ని తగ్గిస్తుందట. 

అందుకోసం..
ఉమామి రుచి కోసం మోనోసిడియం గ్లూటామేజ్‌(ఎంఎస్‌జీ)ని ఉపయోగిస్తారట.  ఇది సహజ పదార్థాల నుంచే తయారవతుంది. పెరుగు లేదా వెనిగర్ తయారీకి ఉపయోగించే పద్ధతిలో తయారు చేయడం లేదా చెరుకు లేదా టాపియోకా  కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారట. ఇందులో ఉప్పులోని సోడియం కంటెంట్‌ కంటే తక్కువగా, పైగా ఉప్పుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందట. పైగా ఇది భోజనాన్ని మితంగా తినేలా చేస్తుంది. అదీగాక ఇంద్రియాలతో రుచిని అనుభవించే మనకు జిహ్వ చాపల్యం శాపంగా మారకుండా ఉమామి రుచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందట. ఫలితంగా రుచిని కోల్పోకుండా పోషకాహారాలను కచ్చితంగా తీసుకోగలుగుతారు.

చివరగా ఉమామి రుచి కోసం గ్లూటామేట్‌ అధికంగా ఉండే కూరగాయలు ప్రతిసారి జోడించడం కుదరనప్పుడూ పైన చెప్పిన కృత్రిమ ఈ ఎంఎస్‌జీ రుచితో కూడిన మసాలా ఉప్పు ఉయోగపడుతుంది. పోషకాహరం పేరుతో పాక రుచిని కోల్పోకుండా తెలివిగా తినే విధానమే ఇది అని చెబుతున్నారు మాజీ ప్రోఫెసర్‌ జమునా.
డాక్టర్ జమునా ప్రకాష్ ఫుడ్ కన్సల్టెంట్, మాజీ ప్రొఫెసర్, మైసూర్ విశ్వవిద్యాలయం

(చదవండి: ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement