మోకాళ్లు నొప్పులు ఎంతలా వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. బాధితులు తాళలేక ఎంతలా ఇబ్బంది పడతారనేది మాటలకందనిది. టాలీవుడ్ నటుడు నాగార్జున సైతం తానుకూడా ఆ సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వాళ్ల అమ్మ కూడా ఆ సమస్యతో బాధపడేదని, తన బాధను చూడలేపోయేవాడినని అన్నారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో తనకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అదెలాగో నటుడు నాగార్జున మాటల్లోనే తెలుసుకుందామా..!.
మా అమ్మకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉండేవి. దీంతో అప్పట్లో ఆమె బాధ చూడలేకపోయేవాడిని.. నొప్పులతో ఓ వైపు అమ్మ బాధ పడుతుంటే.. ఆమెను చూసిన నాకు ప్రాణం విలవిలలాడిపోయేది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం నన్ను బాధించింది.. ప్రస్తుతం నగరంలో ఈ మోకాళ్ల నొప్పులకు స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.. అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
భాగ్య నగరంలోని గచ్చిబౌలిలో ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన స్కైవాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ టెక్నాలజీని బంజారాహిల్స్‌లోని లీలా గ్రాండ్‌లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
‘రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. శరీరంలో కృత్రిమ అవయువాలు అమర్చడం, అవయవ మార్పిడి వంటి చికిత్సలు విజయవంతంగా చేపడుతున్నారు. గతంలో ఇటువంటి వైద్య సేవలు అందుటులో ఉండేవి కావు. దీంతో బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ఇందుకు మా అమ్మే ఉదాహరణ. నా కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయేవాడిని.
ఆర్టిఫిషియల్ అవయవాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పెయిన్ ఫ్రీ లైఫ్ చూస్తున్నాం. ప్రయాణ సమయంలో, ఎయిర్ పోర్టులు, ఇతర ప్రదేశాల్లో మోకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొత్త టెక్నాలజీ గౌరవంగా బతకడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో శరీరానికి ఫిట్నెస్ అవసరం. అదే మంచి జీవితాన్ని అందిస్తుంది.
కులూమనాలీ షూటింగ్ సమయంలో నీ పెయిన్ సివియర్‌గా బాధించింది. కుంటుకుంటూ వెళ్లాను. అమ్మను చూసిన తరువాత నాకు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా స్నేహితులు డా.ప్రభాకర్ గురించి చెప్పారు. ట్రీట్‌మెంట్ తీసుకున్నాక ఐదేళ్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు’అని నాగార్జున తెలిపారు. అక్కడి నుంచి ఏదైనా కొత్తగా మందులు, టెక్నాలజీ వస్తే పరస్పరం షేర్ చేసుకుంటాం. స్కైవాకర్ బిగ్ హీల్ ఫర్ మీ అని పేర్కొన్నారు నాగార్జున . కార్యక్రమంలో ఆరిట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
(చదవండి: వెయిట్ లిఫ్టింగ్‌తో కంటి చూపుకే ముప్పు..! హెచ్చరిస్తున్న వైద్యులు)


