ఈ వెడ్డింగ్ సీజన్ ట్రెండ్... ‘క్రోచెట్ వరమాల’. కాస్త వెనక్కి వెళితే... వివాహం చేసుకోబోయే ఒక జంట నుంచి ఒక మహిళకు ‘వరమాల’ తయారుచేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది.
‘ఎప్పుడూ పూలతోనే చేస్తే ఏం వెరైటీ
ఉంటుంది. కొత్తగా చేయాలి’ అని ఆలోచించింది. ఆమె ఆలోచనలో నుంచి వచ్చిందే... క్రోచెట్ వరమాల. మృదువైన రంగుల ఉన్ని దారాలను ఉపయోగించి ఆమె తయారుచేసిన ‘వరమాల’ ఆహా అనిపించింది. వరమాల మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వరమాలకు ‘క్రోచెట్ వరమాల’గా పేరు వచ్చింది.
ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. ఇలాంటి అందాల వరమాలను మీరు కూడా తయారుచేయాలనుకుంటున్నారా? ‘క్రోచెట్’ హ్యాండిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నేర్చుకోండి. వధూవరులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి!.


