ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్‌లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
బాండి బీచ్ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH
— Terrible Pics (@TerriblePic) December 14, 2025


