చాలామటుకు ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్‌లిప్టింగ్‌తో ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్‌లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్ లిఫ్టింగ్‌లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్.
27 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్ లిఫ్టింగ్ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్ సెషన్ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్‌లో డెడ్‌లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి.
వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు.
ఎందువల్ల ఇలా అంటే..
అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని సబ్‌హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు.
వల్సాల్వా రెటినోపతి అంటే..
వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది.
సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.
ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట.
లక్షణాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు.
అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు
అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యం
ముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.
ఎలా చికిత్స చేస్తారంటే..
ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు.
చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .
యాగ్ లేజర్ చికిత్స
రక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. .


