న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది. ఉదయం ఏడు గంటలు దాటినా అంధకారం తొలగిపోలేదు. వాయు నాణ్యత (AQI) 'తీవ్రమైన' విభాగంలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఉదయం 6 గంటలకు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదకరమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఢిల్లీలోని మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను చూపించాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణిలో అత్యధికంగా 499 AQI నమోదు కాగా, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM2.5) ప్రధాన కాలుష్యకారిగా ఉంది. జహంగీర్‌పురి, వివేక్ విహార్లలో కూడా AQI 495 వద్ద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత (visibility) గణనీయంగా తగ్గింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌కు చెందిన ఫొటోలలో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం కనిపిస్తున్నది. AQI అనేది PM10,PM2.5,O3,SO2,NO2,CO,Pb, NH3 తదితర ఎనిమిది కాలుష్య కారకాల ఆధారంగా గాలి నాణ్యతను తెలియజేయడానికి ఉపయోగించే ఒక సాధనం. CPCB వర్గీకరణ ప్రకారం 401-500 మధ్య AQI 'తీవ్రమైన' విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలో AQI 500 వద్ద పరిమితం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS) కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ AQI 500- 900 వద్ద ఆరోగ్య ప్రభావాలు ఒకే విధంగా ఉంటాయని, భయాందోళనలు కలగకుండా ఉండేందుకు అధిక సంఖ్యలను చూపడం లేదన్నారు.
#WATCH | Delhi | Visuals from the Patparganj section of NH-24 as a layer of toxic smog blankets the city.
AQI (Air Quality Index) around the area is 488, categorised as 'Severe', as claimed by CPCB (Central Pollution Control Board).
CAQM (Commission for Air Quality… pic.twitter.com/RAp43VUQ4f— ANI (@ANI) December 14, 2025
వాయు కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం స్థానిక ఉద్గారాలు మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలి వేగాన్ని గణనీయంగా తగ్గించాయి. గాలి దిశలో మార్పు, దిగువ వాతావరణంలో తేమ శాతం పెరగడం వంటివి కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి అనుకూలంగా మారాయి. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 3 కింద పరిమితులను విధించింది. ఆపై మరింత దిగజారుతున్న పరిస్థితులలో దానిని GRAP-4కి మార్చింది. 'తీవ్రమైన' విభాగంలో AQI ఉండటంతో హృదయ, శ్వాసకోశ బాధితులకు తక్షణ వైద్య అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం


