ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై సీజేఐ ధర్మాసనం బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కాలుష్యం నడుమ స్కూల్ పిల్లలను గ్యాస్ చాంబర్‌లో పెట్టినట్లే అవుతోందని.. కాబట్టి ఇలాంటి సమయంలో క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది.
దేశ రాజధానిలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. పాఠశాల పిల్లలను గ్యాస్ చాంబర్‌లో పెట్టినట్లే అవుతోంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్ల పెట్టొద్దు. క్రీడా కార్యక్రమాలను కాలుష్యం లేని ప్రాంతాల్లో నిర్వహించాలి. నవంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా వేయించండి అని పేర్కొంది.
ఈ మేరకు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో స్కూళ్లలో స్పోర్ట్స్ ఈవెంట్లను వాయిదా వేయించాలని, గాలి నాణ్యత మెరుగయ్యాకే వాటిని నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(CAQM)కి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


