4 నెలల్లో నిర్ణయం తీసుకోండి
కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్‌ఓ) పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నెలవారీ వేతనం రూ.15 వేలకు మించిన వారికి పీఎఫ్ పథకం వర్తించదన్నది తెలిసిందే. దీన్ని గత 11 ఏళ్లుగా సవరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ నవీన్ ప్రకాశ్ నౌటియాల్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెలవారీ వేతనం 15 వేలకు మించితే పీఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.
కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతన మొత్తమే రూ.15 వేలకు మించి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 15 వేల పరిమితి వల్ల పీఎఫ్ పథకం తాలూకు సామా జిక సంక్షేమ ఫలాలు చాలామంది అర్హులైన చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో, పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై 4 నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయ మూ ర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ధర్మాసనం సోమ వారం తీర్పు వెలువరించింది. తమ తీర్పు కాపీని జత పరు స్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి విన తిపత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది.
ఉపసంఘమే చెప్పినా: పీఎఫ్ పథకం లబ్ధిదారుల గరిష్ట వేతన పరిమితి పెంపుపై నిర్దిష్ట నియమ నిబంధనలేవీ లేవు. దాంతో దాని సవరణ విషయంలో ఒక క్రమమంటూ లేకుండా పోయింది. ఒకసారి 12 ఏళ్లకు, మరోసారి 13, 14 ఏళ్లకు గరిష్ట వేతన పరిమితిని సవరించారు. పైగా ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం, ఆర్థిక సూచనలను కూడా పెద్దగా పరిగణనలోకి తీసు కోవడం లేదన్నది సామాజిక కార్యకర్తల ఆరోప ణ. దీనివల్ల అర్హులైన చిరుద్యోగులెందరో పీఎఫ్ పథకం ఫలాలకు దూరమవుతున్నారని నౌటియాల్ తన పిటిషన్‌లో ఆవేదన వెలిబుచ్చారు.


