ఇద్దరి కంటే ఎక్కువ సంతానమున్నా పోటీ చేయొచ్చు  | Rajasthan Cabinet Removes 2-Child Norm For Local Body Elections | Sakshi
Sakshi News home page

ఇద్దరి కంటే ఎక్కువ సంతానమున్నా పోటీ చేయొచ్చు 

Feb 26 2026 5:04 AM | Updated on Feb 26 2026 5:04 AM

Rajasthan Cabinet Removes 2-Child Norm For Local Body Elections

జైపూర్‌: ఇద్దరి కంటే ఎక్కువ సంతానముంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను రాజస్తాన్‌రద్దు చేసింది. సంబంధిత బిల్లును రాష్ట్ర కేబినెట్‌ బుధవారం ఆమోదించింది. ‘‘1991–94కాలంలో సంతాన సాఫల్యరేటు ఏకంగా 3.6 శాతముండేది. ఇప్పుడది రెండు శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో పాత నిర్ణయాన్ని ఇప్పటికీ అమలుచేయడం సహేతుకం కాదు. అందుకే పాత నిబంధనలను మార్చాం. 

పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 19ను మారుస్తూ, రాజస్థాన్‌ మున్సిపాలిటీల చట్టం1994లోని సెక్షన్‌ 24ను సవరిస్తూ కొత్త బిల్లులు తీసుకొస్తున్నాం’’ అని మంత్రి జోగారాం పటేల్‌ మీడియాకు వెల్లడించారు. ఆర్థిక నేరాల కట్టడికి, ఆర్థిక క్రమశిక్షణ ధ్యేయంగా పాత రాష్ట్ర రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ స్థానంలో కొత్తగా రెవిన్యూ ఇంటెలిజెన్స్, ఎకనమిక్‌ అఫెన్సెస్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటుకు కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement