ముంబై: ఎలుకల్ని హతమార్చేందుకు వినియోగించే ఎలుకల మందును వినియోగదారులకు అమ్మే పండ్లకు పూస్తున్న ఘటన కలకలం రేపుతోంది.
ముంబై మలాడ్ ప్రాంతంలో మనోజ్ సంగంలాల్ కేసర్వాని (42), రాహుల్ సదన్లాల్ కేసర్వానిలు పండ్ల వ్యాపారం నిర్వహిస్తుంటారు. అయితే, ఫ్రూట్స్ అమ్మే ప్రాంతంలో ఎలుకల బెడద ఎక్కువ. అందుకే స్టాల్‌పై ఉంచిన ఫ్రూట్స్‌కి ఎలుకల్ని చంపే మందును పూస్తున్నారు.
ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వ్యాపారుల దుకాణాన్ని సీజ్ చేసి, ఫుడ్ అడల్టరేషన్, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు.
నిందితులు విచారణలో, పండ్లను ఎలుకలు తినకుండా కాపాడటానికి రాటోల్ అనే విషపదార్థాన్ని వాడినట్లు చెప్పారు. అయితే, ఈ చర్య ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు. రాటోల్‌లో ఎల్లో ఫాస్ఫరస్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. వీటిని ఆహార పదార్థాలపై వాడటం చట్టవిరుద్ధం. స్థానికులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన తనిఖీలు, క్రమం తప్పని పరిశీలనలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన కొనుగోలు దారుల్లో ఆందోళన నెలకొంది.
मालाडमध्ये परप्रांतीय फळ विक्रेताचा बेजबाबदारपणा शिखरावर! फळांवर Ratol सारखी क्रीम लावून थेट मुंबईकरांच्या जीवाशी खेळ. Ratol सारखे विषारी पदार्थ वापरल्याने उलटी, पोटदुखी, विषबाधा, लिव्हर नुकसान आणि जीवाला धोका निर्माण होऊ शकतो. या विक्रेत्यावर कार्यवाही झालीच पाहिजे.#MNS #mybmc pic.twitter.com/RFtulkwO4h
— शेख जब्बार (राजसाहेबांचा जब्बार) | SHAIKH JABBAR (@jabbarsmns) February 24, 2026


