ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరేం! | Rohit Pawar alleges police refusal to register FIR in Ajit Pawar plane crash case | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరేం!

Feb 26 2026 1:42 AM | Updated on Feb 26 2026 1:42 AM

Rohit Pawar alleges police refusal to register FIR in Ajit Pawar plane crash case

అజిత్‌ విమాన ప్రమాదంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్‌

ఎమ్మెల్యేలం వెళ్లి డిమాండ్‌ చేసినా పోలీసులు పట్టించుకోలేదు

దాంతో మా అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి

విమాన సంస్థ వీఎస్‌ఆర్‌కు టీడీపీ నేతలతో వ్యాపార లింకులు

వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్‌

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మ రణానికి కారణమైన విమాన ప్రమాద ఉదంతంపై అను మానాలు నానాటికీ బలపడుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ అన్నారు. ఆ దుర్ఘటనపై కేసు నమోదు చేయడానికి ముంబై పోలీసులు నిరాకరించడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఉదంతా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో రోహిత్‌ పలు పోస్టులు పెట్టారు.

‘‘అజిత్‌ ప్రయాణించిన లియర్‌జెట్‌ 45 (వీటీ–ఎస్‌ఎస్‌కే) విమానం సొంతదారైన వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ మంగళవారం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దాంతో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు చేయాల్సిందిగా సహచర ఎమ్మెల్యేలు అమోత్‌ మిత్కరీ, సందీప్‌ క్షీర్‌సాగర్, నేను మెరైన్‌ డ్రైవ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డిమాండ్‌ చేశాం.

కానీ ఎఫ్‌ ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరించారు. లాంఛ నంగా మా ఫిర్యాదును స్వీకరించడంతో సరిపెట్టారు. విమా న ప్రమాదంపై మాకిప్పటికే ఉన్న అనుమానాలను పోలీ సుల తీరు మరింత బలపరుస్తోంది’’ అని పేర్కొన్నారు. అజి త్‌ విమాన ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు డిమాండ్‌ చేసే ందుకు గురువారం ఉదయం బారామతి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఫిర్యాదు ను దర్యాప్తు నిమిత్తం సీఐడీకి పంపినట్టు పోలీసులు తెలి పారు.

వెనకేసుకొచ్చిన వైమానిక మంత్రి
వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు డీజీసీఏ తొలుత ప్రయత్నించిందంటూ రోహిత్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కూడా వీఎస్‌ఆర్‌ సంస్థను వెనకేసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విమానంలో భద్రతా లోపాలేవీ లేవని, అన్ని పరీక్షల తర్వాత దానికి డీజీ సీఏ అనుమతులిచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆ విమానంలో లోపాలున్నట్టు ఇప్పుడు డీజీసీఏ చెబుతోంది. అయినా అనుమతులిచ్చిందంటే ఇందులో ఆ సంస్థ తప్పు కూడా ఉన్నట్టే’’ అంటూ దుయ్యబట్టారు.

వీఎస్‌ఆర్‌ సంస్థకు చెందిన నాలుగు విమాన సర్వీసులను తక్షణం నిలిపే యాలని డీజీసీఏ మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఇది తమ పోరాటానికి లభించిన పాక్షిక విజయమని రోహిత్‌ అన్నారు. ‘‘కానీ వీఎస్‌ఆర్‌ తప్పిదాలకు మా నాయకుడు బలయ్యారు. ఏదో ఒకనాటికి అజిత్‌ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. వీఎస్‌ఆర్‌కు చెందిన ఇతర విమాన సర్వీసులను ఎందుకు కొనసాగి స్తున్నారని డీజీసీఏను ప్రశ్నించారు. వాటన్నింటినీ తక్షణం నిలిపేయాలని డిమాండ్‌ చేశారు.

రామ్మోహన్‌ రాజీనామా చేయాల్సిందే
వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయని రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలన్నారు. పౌర విమాన యాన మంత్రి రామ్మోహన్‌నాయుడుది కూడా అదే పార్టీ అని గుర్తు చేశారు. ఆయన రాజీనామా చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. అందుకోసం ఒత్తిడి తెస్తూనే ఉంటానని రోహిత్‌ స్పష్టం చేశారు.

‘‘అంతేగాక వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ యజమానిపై తక్షణం కేసు నమోదు చేయాలి. డీజీసీఏలోని సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అజిత్‌ ప్రయాణించిన విమానం ఫిట్‌గా ఉందని మహా రాష్ట్రకు చెందిన వైమానిక సమన్వయ కంపెనీ ‘యారో’ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడింది. అంతేగాక ప్రమాదం జరిగిన రోజు వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణానికి అనువుగా ఉన్నాయని కూడా పేర్కొంది. కనుక ఆ కంపెనీపైనా కేసు పెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement