breaking news
refusal
-
ఎఫ్ఐఆర్ నమోదు చేయరేం!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మ రణానికి కారణమైన విమాన ప్రమాద ఉదంతంపై అను మానాలు నానాటికీ బలపడుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. ఆ దుర్ఘటనపై కేసు నమోదు చేయడానికి ముంబై పోలీసులు నిరాకరించడమే ఇందుకు తాజా నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఉదంతా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో రోహిత్ పలు పోస్టులు పెట్టారు.‘‘అజిత్ ప్రయాణించిన లియర్‌జెట్ 45 (వీటీ–ఎస్ఎస్కే) విమానం సొంతదారైన వీఎస్ఆర్ వెంచర్స్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ మంగళవారం తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దాంతో ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి ఎఫ్ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా సహచర ఎమ్మెల్యేలు అమోత్ మిత్కరీ, సందీప్ క్షీర్సాగర్, నేను మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డిమాండ్ చేశాం.కానీ ఎఫ్ ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించారు. లాంఛ నంగా మా ఫిర్యాదును స్వీకరించడంతో సరిపెట్టారు. విమా న ప్రమాదంపై మాకిప్పటికే ఉన్న అనుమానాలను పోలీ సుల తీరు మరింత బలపరుస్తోంది’’ అని పేర్కొన్నారు. అజి త్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలుకు డిమాండ్ చేసే ందుకు గురువారం ఉదయం బారామతి పోలీస్ స్టేషన్ కు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిర్యాదు ను దర్యాప్తు నిమిత్తం సీఐడీకి పంపినట్టు పోలీసులు తెలి పారు.వెనకేసుకొచ్చిన వైమానిక మంత్రివీఎస్ఆర్ వెంచర్స్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు డీజీసీఏ తొలుత ప్రయత్నించిందంటూ రోహిత్ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వీఎస్ఆర్ సంస్థను వెనకేసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విమానంలో భద్రతా లోపాలేవీ లేవని, అన్ని పరీక్షల తర్వాత దానికి డీజీ సీఏ అనుమతులిచ్చిందని చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఆ విమానంలో లోపాలున్నట్టు ఇప్పుడు డీజీసీఏ చెబుతోంది. అయినా అనుమతులిచ్చిందంటే ఇందులో ఆ సంస్థ తప్పు కూడా ఉన్నట్టే’’ అంటూ దుయ్యబట్టారు.వీఎస్ఆర్ సంస్థకు చెందిన నాలుగు విమాన సర్వీసులను తక్షణం నిలిపే యాలని డీజీసీఏ మంగళవారం ఆదేశించడం తెలిసిందే. ఇది తమ పోరాటానికి లభించిన పాక్షిక విజయమని రోహిత్ అన్నారు. ‘‘కానీ వీఎస్ఆర్ తప్పిదాలకు మా నాయకుడు బలయ్యారు. ఏదో ఒకనాటికి అజిత్ కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. వీఎస్ఆర్కు చెందిన ఇతర విమాన సర్వీసులను ఎందుకు కొనసాగి స్తున్నారని డీజీసీఏను ప్రశ్నించారు. వాటన్నింటినీ తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు.రామ్మోహన్ రాజీనామా చేయాల్సిందేవీఎస్ఆర్ వెంచర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. వీటన్నింటిపైనా లోతుగా దర్యాప్తు జరగాలన్నారు. పౌర విమాన యాన మంత్రి రామ్మోహన్నాయుడుది కూడా అదే పార్టీ అని గుర్తు చేశారు. ఆయన రాజీనామా చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. అందుకోసం ఒత్తిడి తెస్తూనే ఉంటానని రోహిత్ స్పష్టం చేశారు.‘‘అంతేగాక వీఎస్ఆర్ వెంచర్స్ యజమానిపై తక్షణం కేసు నమోదు చేయాలి. డీజీసీఏలోని సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అజిత్ ప్రయాణించిన విమానం ఫిట్‌గా ఉందని మహా రాష్ట్రకు చెందిన వైమానిక సమన్వయ కంపెనీ ‘యారో’ తప్పుడు ధ్రువీకరణకు పాల్పడింది. అంతేగాక ప్రమాదం జరిగిన రోజు వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణానికి అనువుగా ఉన్నాయని కూడా పేర్కొంది. కనుక ఆ కంపెనీపైనా కేసు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. -
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా. శభాష్ అవధేశ్ రానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్‌ల వివాహం నవంబర్ 22న ముజఫర్‌నగర్‌లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు. నా మనస్సాక్షికి విరుద్ధం.. సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.మా బంధం రూపాయితో మొదలైంది.. తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్‌ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్వీలర్కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
నిర్భయ కేసు విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణని సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదావేసింది. అలాగే రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌నూ శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తన పాత లాయర్‌ను తొలగించారని, కొత్త లాయర్‌ను నియమించు కోవడానికి సమయం అవసరమని దోషి పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్ఎస్ఏ) మరో లాయర్‌ను సూచించగా అందుకు పవన్ సుముఖంగా లేనట్టు తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. విచారణ ఆలస్యం కావడంతో జడ్జి ధర్మేంద్ర. పవన్ తరఫున వాదించేందుకు రవి క్వాజీ అనే లాయర్‌ను కొత్తగా నియమించారు. -
వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన జస్టిస్ చలమేశ్వర్
న్యూఢిల్లీ: వచ్చే నెల 22న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) తలపెట్టిన వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గతవారం జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసి వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించగా ఆయన తిరస్కరించారని ఎస్సీబీఏ కార్యదర్శి వికాస్ సింగ్ తెలిపారు. దీంతో బుధవారం తాము మరోసారి వెళ్లి, ఆయన్ను ఒప్పించేందుకు యత్నించగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ అయినప్పుడూ వీడ్కోలు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి పనిదినమైన ఈనెల 18న జస్టిస్ చలమేశ్వర్ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వికాస్ సింగ్ వివరించారు. కాగా, జస్టిస్ చలమేశ్వర్ గత మూడు వారాలుగా బుధవారం రోజు కోర్టు విధులకు హాజరుకావడం లేదని కోర్టు వర్గాలు తెలిపాయి. -
‘డ్రీమర్ల’కు సెనెట్ నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి. -
నీట్ ఆర్డినెన్స్ స్టేపై సుప్రీం కోర్టు నిరాకరణ
-
సెక్స్‌కు ఒప్పుకోలేదని.. 19 మంది దహనం
బాగ్దాద్: ఇరాక్‌లో యాజ్దీ యువతులపై ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల పైశాచికత్వం నిరాఘటంగా కొనసాగుతోంది. జిహాదీల వాంఛలు తీర్చేందుకు సెక్స్ బానిసలుగా మారడానికి ఒప్పుకోని 19 యాజ్దీ అమ్మాయిలను ఇనుపబోనులో బంధించి సజీవ దహనం చేశారు. ఈ దారుణ సంఘటన ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో చోటుచేసుకుందని స్థానిక మీడియా ప్రతినిధి అబ్దుల్లా అల్ మల్లా కుర్దీష్ వార్తా సంస్థ ఏఆర్ఏ న్యూస్‌కు వెల్లడించారు. వందలాది మంది ప్రజలు చూస్తుండగానే టెర్రరిస్టులు ఈ దారుణ మారణకాండకు పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ప్రజలెవరూ కూడా సాహసించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటికే మూడువేల మంది యాజ్దీ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా చేసుకున్న టెర్రరిస్టులు వారిపై అకృత్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇరాక్‌లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఆక్రమించుకున్న 2014 నుంచి వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. సెక్స్ బానిసలుగా మారేందుకు ఒప్పుకోని యాజ్దీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు. క్రైస్తవం, జొరాస్ట్రియన్, ఇస్లాం మతాన్ని ఆచరించే యాజ్దీ జాతి ప్రజలను ఐఎస్ఐఎస్ సైతాన్ ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలను భరించలేక ఇప్పటికే దాదాపు యాభైవేల మంది యాజ్దీలు దేశం విడిచి పారిపోయారు.


