‘నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు’ | Trump makes first comments on Mar a Lago incident | Sakshi
Sakshi News home page

‘నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు’

Feb 24 2026 5:12 AM | Updated on Feb 24 2026 9:49 AM

Trump makes first comments on Mar a Lago incident

వాషింగ్టన్‌: తన నివాస ప్రాంతమైన మార్‌-ఎ-లాగో రిసార్టులోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనపై ట్రంప్‌ స్పందించాడు. తాను ఎంతకాలం నేను ఇక్కడ ఉంటానో తెలియదు. అనేమంది తనని టార్గెట్‌ చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. 

ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది. దుండగుడు ట్రంప్ నివాస ప్రాంగణంలో మార్టిన్‌ అక్రమంగా ప్రవేశించడంతో, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై  కాల్పులు జరిపి హతమార్చారు.

పోలీసుల వివరాల ప్రకారం, నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ ఫిబ్రవరి 23 తెల్లవారుజామున ఉత్తర గేటు వద్ద రైఫిల్‌తో లోపలికి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినా, ఆయుధాన్ని వదలమని చెప్పినా అతను నిరాకరించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన సమయంలో ట్రంప్, మెలానియా ట్రంప్ అక్కడ లేరు. ఈ సంఘటనపై ట్రంప్‌ పైవిధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ట్రంప్‌పై దాడికి ఎందుకు యత్నించాడు. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు  

 

Advertisement
 
Advertisement
Advertisement