ట్రంప్ టారిఫ్‌లు చెల్లవంటూ తీర్పు
ప్రభుత్వ బ్యాంకులు, ఆటో షేర్లకు డిమాండ్
సెన్సెక్స్ లాభం 480 పాయింట్లు
25,700 ఎగువకు నిఫ్టీ
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్‌లు) చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు.
ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.
ళీ బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.4%, సరీ్వసెస్ 0.97%, హెల్త్‌కేర్ 0.89%, విద్యుత్ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్
సరీ్వసెస్ 0.65%, ఎఫ్‌ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% లాభపడగా, మిడ్‌క్యాప్ సూచీ 1.56% నష్టపోయింది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు డీలా
హరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది.


