మెడికవర్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ | Medicover Hospitals signs agreement with Evergreen Healthcare | Sakshi
Sakshi News home page

మెడికవర్‌ ఎయిర్‌ అంబులెన్స్‌

Feb 24 2026 4:05 AM | Updated on Feb 24 2026 8:07 AM

Medicover Hospitals signs agreement with Evergreen Healthcare

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా, అంతర్జాతీయంగా పేషంట్ల బదిలీ కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ సరీ్వసులను అందుబాటులోకి తెచ్చేలా ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో కొత్త ఆసుపత్రిని ఇంకా అధికారికంగా ప్రారంభించేలోపే ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల, తొలి రోజు నుంచే ఎమర్జెన్సీ సమయాల్లో మరింత మెరుగ్గా స్పందించేందుకు వీలవుతుందని సంస్థ తెలిపింది.

 ప్రతి క్షణం విలువైనదిగా ఉండే క్రిటికల్‌ కేసుల్లో ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని హెడ్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ నయన్‌ శ్రీరాముల తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటులాంటి క్రిటికల్‌ సందర్భాల్లో పేషంట్లను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరగడమనేది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement