సీనీ హీరోలు ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. గంటలపాటు జిమ్ లో కష్టపడి నోరుకట్టుకుని మరీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు. రాత్రి త్వరగా పడుకోవడం.. ఉదయాన్నే లేచి.. వ్యాయామం..ఒక్క పూట భోజనం చేస్తూ తమ ఫిజిక్‌ని వయసు కన్న తక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఓ హీరో మాత్రం ఇందుకు విరుద్ధంగా డైట్ ఫాలో అవుతున్నాడు.
ఉదయం జిమ్ చేయకుండానే.. రాత్రిళ్లు త్వరగా నిద్రపోకుండానే అద్భుతమైన ఫిట్నెస్‌ని మెయింటైన్ చేస్తూ..60లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఆయనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan ). ఆయన రాత్రంతా మెలకువతో ఉండి ఉదయం ఐదు గంటకు నిద్రపోతాడు అట. అంతేకాదు అర్థరాత్రి 2 గంటకు జిమ్ చేస్తాడట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పడుకొని పది గంటలకు అలా మెల్కొంటాను. అర్థరాత్రి రెండు గంటలకు జిమ్ చేస్తాను. ఆ తర్వాత స్నానం చేసుకొని ఉదయం 5 గంటలకు నిద్రపోతాను. అప్పుడప్పుడు మద్యం కూడా తీసుకుంటాను.అయితే ఎప్పుడైన నిర్ధిష్టమైన పాత్ర కోసం ఒక షేప్‌లోకి రావాలంటే మాత్రం మద్యం తీసుకోవడం మానేస్తాను. అలాగే వైట్ రైస్, స్వీట్లు కూడా తినడం మానేస్తాను. కొన్నిసార్లు చాక్లెట్, ఐస్‌క్రీం కూడా తింటాను. కానీ వర్కౌట్ మాత్రం చేస్తుంటాను’ అని షారుఖ్ ఖాన్ అన్నారు. నేటితో(నవంబర్ 2) ఆయన 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. అయినప్పటికీ ఫిట్నెస్ విషయంలో మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తాడు.


