'కేడీ' దర్శకుడు కన్నుమూత | Tollywood Director Kiran Kumar Passed Away | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు కేకే కన్నుమూత

Dec 17 2025 1:22 PM | Updated on Dec 17 2025 3:26 PM

Tollywood Director Kiran Kumar Passed Away

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్‌ కుమార్‌ (కేకే) బుధవారం (డిసెంబర్‌ 17న) ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్‌, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాకు కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. కిరణ్‌ కుమార్‌ను అందరూ ఆప్యాయంగా కేకే అని పిలుచుకుంటారు. కేకే దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సందీప్‌ రెడ్డి ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

చదవండి: తండ్రి నుంచి తాతగా ప్రమోషన్‌? నాగ్‌ ఆన్సరిదే

Advertisement
 
Advertisement
Advertisement