‘చికిరి చికిరి...’ అంటూ ‘పెద్ది’ సినిమా లో రామ్‌చరణ్ వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన నెలలోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని, అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఓ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నవంబరులో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
చాంపియన్‌కి అతిథిగా... రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నెల 18న జరగనున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని యూనిట్ ప్రకటించింది.


