బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్‌ వీడియో సాంగ్ వచ్చేసింది | Bad Girlz Movie Leloo SOng out now | Sakshi
Sakshi News home page

Bad Girlz Movie: బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్‌ వీడియో సాంగ్ చూశారా?

Dec 16 2025 10:12 PM | Updated on Dec 16 2025 10:12 PM

Bad Girlz Movie Leloo SOng out now

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్‌ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్‌ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌ లైన్‌. అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్‌టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్‌ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ ‍సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్‌ సూర్య, మొయిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రం క్రిస్మస్‌ పండగ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.  జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్  అని  దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement