breaking news
Bad Girlz Movie
-
'బ్యాడ్ గాళ్స్' షోలు పెంచుతున్నాం: దర్శకనిర్మాతలు
రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు. -
‘బ్యాడ్ గాళ్స్ ’ మూవీ రివ్యూ
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’.రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఈ సినిమా కథంతా హైదరాబాద్‌లోని హాస్టల్లో ఉంటున్న నలుగురు అమ్మాయిలు రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మిల చుట్టూ తిరుగుతుంది. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక ఫారిన్ ట్రిప్ వేయాలని స్నేహితులంతా అనుకుంటారు. క్క స్రవంతి సహాయంతో మలేషియా ట్రిప్‌కి ప్లాన్ వేస్తారు. అదే సమయంలో అనకొండ అనే పేరుమోసిన టెర్రరిస్ట్ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.ఎలా ఉందంటే.. సరదాగా సాగిపోయే ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్లడం.. అనుకోని సమస్యలు రావడం..చివరకు ఓ సందేశం ఇవ్వడం.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. బ్యాడ్ గాళ్స్ స్టోరీ కూడా అలానే సాగుతుంది. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్‌కు తగ్గట్టే ఉంటాయి.అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పలు సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులో రిపీట్ కావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.ఇక సెకండాఫ్‌లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్‌ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్‌ప్లే, కామెడీ పంచ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.ఎవరెలా చేశారంటే.. నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై చక్కగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం , నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్ : 2.5/5 -
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్‌గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. -
బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు.


