రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.
దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు.


