‘బిగ్ బాస్’కి రుణపడి ఉంటా : సంజన | Bigg Boss 9: Sanjjanaa Galrani Shares Experience About Bigg Boss Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ వల్ల నాగార్జునకి పెద్ద ఫ్యాన్‌ అయిపోయా : సంజన

Dec 27 2025 5:53 PM | Updated on Dec 27 2025 7:37 PM

Bigg Boss 9: Sanjjanaa Galrani Shares Experience About Bigg Boss Show

"ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.

బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement