ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్‌లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్‌లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..
మోనాలిసా
మోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్‌లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది.
ఆర్యప్రియ భుయన్
కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ స్టార్ అయింది.
గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్‌తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్‌గా మారింది.
అలీషా ఓరీ
ఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది.
Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO
— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025
మహికా శర్మ
క్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్‌తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.


