ఆ హీరోయిన్‌కు ఫోన్‌ చేసి సారీ చెప్పా: రవీనా టండన్‌ | Raveena Tandon Said Sorry to Yami Gautam after watching Dhurandhar | Sakshi
Sakshi News home page

Raveena Tandon: ధురంధర్‌ మూవీ చూశాక హీరోయిన్‌కు ఫోన్‌ చేసి క్షమాపణలు!

Feb 16 2026 10:18 AM | Updated on Feb 16 2026 10:53 AM

Raveena Tandon Said Sorry to Yami Gautam after watching Dhurandhar

అటు బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము దులిపిన "ధురంధర్‌" ప్రస్తుతం ఓటీటీలోనూ చెలరేగుతోంది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీపై హీరోయిన్‌ రవీనా టండన్‌ ప్రశంసలు కురిపించింది. దానికంటే ముందు హీరోయిన్‌ యామీ గౌతమ్‌కు క్షమాపణలు చెప్పింది.

హీరోయిన్‌కు సారీ
జూమ్‌ పాడ్‌కాస్ట్‌లో రవీనా టండన్‌ మాట్లాడుతూ.. ధురంధర్‌ సినిమా చూశాక హీరోయిన్‌ యామీ గౌతమ్‌కు ఫోన్‌ చేశాను. ఐయామ్‌ సారీ, నేను నీ భర్త (దర్శకుడు ఆదిత్య ధర్‌)కు వీరాభిమానిని అని మాట్లాడాను. ఈ విషయం ఆమె భర్తతో చెప్పమన్నాను. మన సినిమాల్లో ఏదైతే మిస్‌ అవుతుందో దాన్ని ఆయన తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్‌, ధురంధర్‌ వంటి సినిమాలు చూశాక జనాల్లో సంతృప్తి కలిగింది. 

ఎంత ఎదిగిపోయాడో!
ఇప్పుడు హీరోలు నిజమైన హీరోల్లా కనిపిస్తున్నారని ఫీలవుతున్నారు. ధురంధర్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ 10 ఏళ్ల వయసులో నేను ఓ సాంగ్‌ చేస్తుండగా చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఎంత ఎదిగిపోయాడో! సినిమాలో అద్భుతంగా నటించాడు. సంజయ్‌, అక్షయ్‌ కూడా చించేశారు. సారా అర్జున్‌, రాకేశ్‌ బేడీ, గౌరవ్‌ కూడా బాగా యాక్ట్‌ చేశారు అని రవీనా టండన్‌ చెప్పుకొచ్చింది.

సినిమా
ధురంధర్‌ గతేడాది డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్‌వీర్‌ సింగ్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా, ఆర్‌.మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌, సారా అర్జున్‌, రాకేశ్‌ బేడీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 మార్చి 19న రాబోతోంది.

చదవండి: టాలీవుడ్‌లో సీక్వెల్‌ ట్రెండ్‌కు బ్రేక్‌?

Advertisement
 
Advertisement
Advertisement