‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు | Master Mahendran Nilakanta Movie Teaser Release Highlights | Sakshi
Sakshi News home page

‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు

Dec 27 2025 5:15 PM | Updated on Dec 27 2025 8:56 PM

Master Mahendran Nilakanta Movie Teaser Release Highlights

టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ రాకేష్ మాధవన్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నాకు సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.

డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది.  ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement