breaking news
Nilakanta Movie
-
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ప్రతివారం థియేటర్లలో అయినా సినిమాలు మిస్ అవుతాయేమో గానీ ఓటీటీల్లో మాత్రం తెలుగు, డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. అలా వచ్చే వారం రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి లాంటి సంక్రాంతి మూవీస్.. డిజిటల్‌గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏంటా మూవీ?(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలనటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మహేంద్రన్.. పెద్దయ్యాక 'మాస్టర్' తదితర తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. అలా చేసిన ఓ మూవీ 'నీలకంఠ'. ఈ నెల 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న స్టార్స్ లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిందో అన్నంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సన్ నెక్స్ట్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'నీలకంఠ' విషయానికొస్తే.. సరస్వతిపురం గ్రామం. ఊరిలో ఎవరూ తప్పు చేసినా గ్రామపెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇదే ఊరికి చెందిన టైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు.. పదో క్లాసు చదువుతున్న ఓ తప్పు చేస్తాడు. దీనికి శిక్షగా 15 ఏళ్లపాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఈ కారణం వల్ల నీలకంఠ పెద్ద చదువులు చదవలేకపోతాడు. కబడ్డీ ప్లేయర్ అవుతాడు గానీ శిక్ష వల్ల మండల స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఇదే ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి)తో నీలకంఠ ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంగా సీత తండ్రితోనే సర్పంచ్ అవుతానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి) -
మాస్టర్ మహేంద్రన్ ‘నీలకంఠ’ మూవీ రివ్యూ
మాస్టర్ మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించిన ఈ చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కట్టుబాట్లకు పెట్టింది పేరు సరస్వతిపురం గ్రామం. అక్కడ తప్పుడు చేసిన వారికి గ్రామ పెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తాడు. ఆ ఊరి ట్రైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ(మాస్టర్ మహేంద్రన్) పదో తరగతి చదువుతున్న సమయంలో ఓ తప్పు చేస్తాడు. దానికి శిక్షగా 15 ఏళ్ల పాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఆ శిక్ష కారణంగా నీలకంఠ ఉన్నత చదువులు చదవలేకపోతాడు. దీంతో ఊర్లోనే కబడ్డీ ఆట ఆడడం మొదలుపెడతాడు. ఊర్లో జరిగే అన్ని కబడ్డీ పోటీల్లోనూ గెలుస్తాడు. కానీ ఆయనకి పడ్డ శిక్ష కారణంగా మండల స్థాయి కబడ్డీ ఆటల్లో పాల్గొనలేకపోతాడు. దీంతో ప్రతిసారి సరస్వతిపురం మండలస్థాయిలో ఓడీపోతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే..టెన్త్ క్లాస్‌లో నీలకంఠ ఆ ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి) ఇష్టపడతాడు. ఆమె ఉన్నత చదువుల కోసం వెళ్లి.. 15 ఏళ్ల తర్వాత తిరిగి ఊరికి వస్తుంది. తన కూతురు నీలకంఠతో ప్రేమలో ఉందన్న విషయం తెలుసుకున్న సర్పంచ్.. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటాడు. నీలకంఠ అడ్డుకొని.. సీత వాళ్ళ నాన్న ఏది అయితే స్థాయి అనుకుంటున్నాడో ఆ సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. దొంగగా ముద్ర వేసుకున్న నీలకంఠ సర్పంచ్‌గా గెలిచాడా? మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిసారి ఓడిపోతున్న సరస్వతీ గ్రామాన్ని నీలకంఠ ఎలా గెలిపించగలిగాడు? అసలు నీలకంఠ చేసిన తప్పేంటి? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం నీలకంఠ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా(Nilakanta Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక ఊరు..అక్కడ కొన్ని కట్టుబాట్లు.. అవి పాటించకపోతే ఓ పెద్దమనిషి శిక్ష వేయడం.. చేయని తప్పుకు హీరో శిక్ష అనుభవించడం..చివరకు ఊరి కోసం హీరో ఏదో ఒక మంచి పని చేసి..వారందరిచేత జై కొట్టించుకోవడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో ‘పెదరాయుడు’ తో పాటు చాలా సినిమాలు వచ్చాయి. నీలకంఠ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ కోర్ పాయింట్ కాస్త కొత్తగా ఉంటుంది. తప్పు చేస్తే ఊరు నుంచి వెలేయడం గత సినిమాల్లో చూశాం..కానీ ఇందులో మాత్రం తప్పు చేసినవాడిని ఊర్లోనే ఉంచి..ఇఫ్టమైనది దూరం చేయడం అనేది ఆసక్తికర అంశం. సినిమా ప్రారంభంలోనే ఆ విషయం చెప్పి.. అసలు కథను ప్రారంభించారు దర్శకుడు. నాన్ లినియర్ స్క్రీన్ ప్లేతో కథను ముందు వెనక్కి జరుపుతూ.. తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశారు. ఫస్టాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీతో పాటు హీరోయిన్‌తో లవ్‌స్టోరీని చూపించి.. ఓ సస్పెన్స్‌తో ఇంటర్వెల్ సీన్ కట్ చేశారు. ఇక సెకండాఫ్ అంతా సీరియస్‌గా సాగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి.ఊరు లో జరిగే కబడ్డీ స్పోర్ట్స్ ని బాగా చిత్రీకరిచారు. చివరి 25 నిముషాలు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. కధకి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ని లాస్ట్ లో కొత్తగా చూపించారు. తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడం లో దర్శకుడు విజయం సాధించాడు.అయితే ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్న మాస్టర్ మహేంద్రన్.. ఈ మూవీతో హీరోగా మారి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సీత పాత్రకి యష్న ముతులూరి న్యాయం చేసింది.స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్ తో చేసింది.రాంకీ గారిని చాల రోజుల తరువాత స్క్రీన్ మీద చూడటం బాగా అనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ ప్రశాంత్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వింటేజ్ ఫిలింగ్ని కలిగిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.5/5 -
నీలకంఠ విజయం సాధించాలి: ఆది సాయికుమార్
‘‘నేను, మహేంద్రన్ చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. తను మంచి యాక్టర్. ‘నీలకంఠ’ సినిమా తనకు, యూనిట్‌కి పేరు తీసుకురావాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయం అందించాలి’’ అని హీరో ఆది సాయికుమార్ కోరారు. మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘నీలకంఠ’ మహేంద్రన్‌కి, టీమ్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ’ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది’’ అని మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి, రాకేష్ మాధవన్, మహేంద్రన్, యష్న ముతులూరి’’ పేర్కొన్నారు. -
‘నీలకంఠ’.. చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోలేరు
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నాకు సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


