భారతీయ రైల్వే సరికొత్త మైలురాయిని తాకింది. పర్యావరణహితంగా, స్వదేశీసాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శూన్య ఉద్గారాల (Zero-emission) రైలుహర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాంటి రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల సమూహం లోకి భారతదేశం చేరింది. రైల్వే రంగంలో భారతదేశం స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించేలా చూడటంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ.
దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు ప్రతిరూపంగా రీసెర్చ్, డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్' (RDSO) ద్వారా ఈ రైలు పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. ఈ టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద, శక్తివంతమైన హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది.
ఇదీ చదవండి: హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు
Prime Minister @narendramodi flags off India's first Hydrogen train between Jind and Sonipat at Jind railway station#HydrogenTrain #भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन @RailMinIndia
Watch: ⬇️ pic.twitter.com/j1lJCliqRs— PIB India (@PIB_India) July 17, 2026
;
గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ఆమోదం పొందింది, కానీ దీని డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇందులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఇది 2600 ప్రయాణీకులనువారి వారి గమ్య స్థానాలకు చేరుస్తుంది.నిజానికి ప్రపంచంలో ఇప్పటికే నడుస్తున్న ఈ హైడ్రోజన్ ట్రైన్‌లకు కేవలం రెండు, నాలుగు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అదీడా అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తాయి.
ఇది జింద్ జంక్షన్, గోహానా జంక్షన్ ,సోనిపత్‌లను కలుపుతూ, జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానె హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రాబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్ , సోనిపత్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది.పైలట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసినన ఈ రైలు, హైడ్రోజన్ టెక్నాలజీని పరీక్షించడంలో, భారతదేశంలో పర్యావరణ అనుకూల రైలు ప్రయాణం కోసం భవిష్యత్ ప్రణాళికలకు మద్దతు నిస్తుంది.
హైడ్రోజన్ ఆధారిత రైళ్లు ఉన్న ఇతర దేశాలు ఏవి?
హైడ్రోజన్ ఆధారిత రైలును నడుపుతున్నదేశాల్లో అమెరికా జర్మనీ, జపాన్, చైనా ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు అయిన ఆల్‌స్టామ్ కొరాడియా ఐలింట్ (Alstom Coradia iLint) ను ప్రవేశపెట్టడంలో జర్మనీ ముందంజలో ఉంది.
ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్


