విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు దాటారు. పాఠాలు చెప్పాల్సిన తరగతి గదిలోనే అనుచిత ప్రవర్తించారు. ఆ వీడియోలు కాస్త బయటకు రావడంతో.. తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇటు విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు.. తరగతి గదిలో హద్దులు దాటి ప్రవర్తించారు. విద్యార్థులు లేని టైం చూసుకుని ఏకాంతంగా కలుసుకున్నారు. ముద్దులతో, కౌగిలింతలతో.. రెచ్చిపోయారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. విద్యాశాఖ రంగంలోకి దిగింది.
ఇద్దరు సీనియర్ టీచర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. నివేదికలో.. వాళ్లు తప్పు చేసినట్లు తేలింది.ప్రవర్తన ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని.. ఇలాంటి చర్యలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చింది. దీంతో విద్యాశాఖ వాళ్లను సస్పెండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్ జిల్లాలోని సౌరిక్ బ్లాక్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. నివేదిక ఆధారంగా జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఒక టీచర్‌ను గుగరాపూర్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు, మరో టీచర్‌ను తాల్గ్రామ్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు అటాచ్ చేశారు. చాలా కాలంగా వీళ్లిద్దరూ ఇలా చేస్తున్నట్లు తేలిందని ఆయన అంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిజమైనదేనా? ఎప్పుడు చిత్రీకరించారు? అనే అంశాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. వీడియోలో మాత్రం ఆ క్లాస్‌రూం రొమాన్స్.. ఈ ఏడాది జనవరిలో జరిగినట్లు డేట్ కనిపిస్తోంది. వీడియో ప్రామాణికతను నిర్ధారించే విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన గురువులే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పాఠాలు చెప్పాల్సిన క్లాస్‌రూంలోనే అనుచిత ప్రవర్తనకు పాల్పడి.. చివరకు ఇద్దరు టీచర్లు తమ ఉద్యోగాలపై వేటు పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు.


