ఆధ్యాత్మిక శోభతో భాగ్యనగరం మరోసారి కళకళలాడింది.
పూరీ సంప్రదాయాన్ని తలపించేలా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జగన్నాథ స్వామి రథయాత్రలు వైభవంగా జరిగాయి.
గురువారం వేలాది మంది భక్తులు "జై జగన్నాథ్" నామస్మరణల మధ్య రథాన్ని లాగుతూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
బంజారాహిల్స్, కవాడిగూడ, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రథయాత్రలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
కవాడిగూడలో మంత్రి శ్రీధర్‌బాబు రోడ్డును చీపురుతో ఊడ్చి రథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రంగురంగుల అలంకరణలతో మెరిసిన రథాలు, భజనలు, కీర్తనలు, భక్తుల సందడి నగరానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి.


