తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే హైదరాబాద్ గోల్కొండ బోనాలకు వేళయ్యింది. గురువారం శ్రీజగదాంబిక మహంకాళికి తొలిబోనాన్ని భక్తులు సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో అలకరించారు.


