హైదరాబాద్‌లో 15వ ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్–2026 ఉత్సాహంగా సాగింది. మాదాపూర్ హైటెక్స్‌లో జరిగిన ఈ రన్‌లో 6,500 మందికిపైగా రన్నర్లు పాల్గొన్నారు. వారిలో 300 మంది దివ్యాంగ రన్నర్లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ సిల్వర్ సస్టేనబిలిటీ అవార్డు లభించింది. ‘సెల్‌ఫోన్ వద్దు–పుస్తకమే ముద్దు’ సందేశంతో పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేశ్ పిలుపునిచ్చారు.


