భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు.
శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనం దొరకడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు.
స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ తిరుమలకు వచ్చిన విషయం తెలుసుకున్న తోటి భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కోసం పోటీ పడ్డారు.
(Images Source : Instagram/itsmytirupati)


