'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే? | Irumudi Movie Actor Komaram Remuneration | Sakshi
Sakshi News home page

Irumudi Komaram Remuneration: నాగులు పాత్ర.. ఎంత డబ్బిచ్చారో చెప్పిన కొమరం

Aug 28 2026 8:01 PM | Updated on Aug 28 2026 8:14 PM

Irumudi Movie Actor Komaram Remuneration

వారం గడిచిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో 'ఇరుముడి' సినిమా అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవైపు భారీ హైప్‌తో రిలీజైన 'టాక్సిక్'కి ఫ్లాప్ టాక్ రావడం రవితేజ మూవీకి ఈ వీకెండ్ మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇందులో నాగులు అనే విలన్ టచ్ ఉన్న పాత్ర చేసిన కొమరం.. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా)

'ఇరుముడి' సినిమా ముందు వరకు కొమరం అంటే లేడీ గెటప్స్ వేసే వ్యక్తిగా మాత్రమే జనాలకు తెలుసు. ఇతడిలో విలనిజం చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. నాగులు పాత్రలో సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఇప్పటికే తనకు వస్తున్న గుర్తింపు చూసి ఉ‍బ్బితబ్బిబ్బి అయిపోతున్న కొమరం, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను 16 రోజులు పనిచేస్తే.. రోజుకీ రూ.60 వేలు లెక్కన ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

అంటే 'ఇరుముడి'లో నటించినందుకుగానూ కొమరం రూ.9.6 లక్షలు అందుకున్నాడు. ఈ మూవీలో అద్భుతమైన యాక్టింగ్ చేసిన ఇతడికి.. 'బలగం' వేణు తాను తీస్తున్న 'ఎల్లమ్మ'లో పిలిచి అవకాశమిచ్చాడు. ఈ సంగతి కూడా స్వయంగా కొమరం మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గత 18 ఏళ్లుగా ఇతడు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'జబర్దస్త్' లాంటి షోల్లో లేడీ గెటప్స్ వేసుకునే కమెడియన్‌గానే జనాలకు తెలుసు. ఇప్పుడు 'ఇరుముడి'తో ఫేట్ మారిపోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రోజుకు రూ.60 వేల పారితోషికం ఉన్నది కాస్త త్వరలో క్రేజ్ పెరిగితే రూ.లక్ష అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement