టాలీవుడ్‌లో ఇప్పుడంతా ఇరుముడి మానియా నడుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.
భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ఇరుముడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి నటుడు అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్‌కు వెళ్లిన సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
తన సొంత ఊరు వేటపాలం థియేటర్లో లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని #Irumudi సినిమా చూసిన నటుడు Ajay Ghosh. ❤️ pic.twitter.com/LeqCajihvC
— cinee worldd (@Cinee_Worldd) August 27, 2026


