ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... | BTech Graduate Job Dream Ends In Road Accident Tragedy After Hyderabad Interview, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి...

Aug 27 2026 7:44 AM | Updated on Aug 27 2026 9:55 AM

Road Incident To Suravarapu Shakeena

పటమట(విజయవా­డతూర్పు): బీటెక్‌ చదివిన సూరవరపు షకీనా­(24)  ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమ­వారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్‌ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు.

 భీమవరానికి చెందిన షకీనాకు  రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్‌ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు. 

చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement