34% రిజర్వేషన్లు.. మహా డ్రామా | YS Jaganmohan Reddy Fires On Chandrababu govt | Sakshi
Sakshi News home page

34% రిజర్వేషన్లు.. మహా డ్రామా

Aug 27 2026 5:35 AM | Updated on Aug 27 2026 5:37 AM

YS Jaganmohan Reddy Fires On Chandrababu govt

బాబు జమానాలో బీసీల బతుకులు బుగ్గిపాలు

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే కోర్టులో కేసు వేయించి కొట్టించేశాడు 

అయినా రిజర్వేషన్లకు మించి బీసీలను ఓపెన్‌ కేటగిరీలో ప్రమోట్‌ చేశాం 

వారికి అత్యధికంగా లబ్ధి జరిగింది జగన్‌ హయాంలోనే

4 రాజ్యసభ, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, మంత్రుల్లో 40% బీసీలకే ఇచ్చాం  

2014–19 మధ్య బాబు బీసీలకు ఒక్క రాజ్యసభ సీటూ ఇవ్వలేదు 

సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీ చైర్మన్‌ వరకు అత్యధిక సీట్లు బీసీలకు ఇచ్చింది వైఎస్సార్‌సీపీనే 

అయిదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా బీసీ అక్కచెల్లెమ్మలకు రూ.1.82 లక్షల కోట్లు అందించాం 

నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీలకు 50%.. అందులో మహిళలకు 50% ఇస్తూ చట్టం తీసుకొచ్చాం 

బీసీ జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం 

బీసీలకు 50% సీట్లు కల్పించాలంటూ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాం

మా హయాంలో బీసీలకు జరిగిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి 

బీసీలు ఎదుగుతుంటే చంద్రబాబు చూడలేడు.. వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నాడు 

సీదిరి అప్పలరాజు, చింతాడ రవి, విరూపాక్షి, కారుమూరి నాగేశ్వరరావులపై అక్రమ కేసులు  

విశాఖలో ఆరుగురు మత్స్యకారులు చనిపోతే కనీసం స్థానిక మంత్రి వెళ్లలేదు 

బీసీలపై ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తాడా? 

ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు అంటూ మహా డ్రామాకు తెరలేపాడు 

నిజంగా ఎవరి హయాంలో బీసీలకు అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి   

వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్‌ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్‌సీపీ.. ఓన్లీ జగన్‌ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.

50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్‌సీపీ మాత్రమే.     

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం. 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. 
-వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాడు. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సా­హం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు.. అంతకంటే ఎక్కువ పద­వు­లు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పు­లు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్‌ హై­కోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్లు పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామాకు దిగాడని విమర్శించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని.. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టి వేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనేనంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్‌ సిక్స్, సూపర్‌సెవెన్‌ హామీలను చెత్త బుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తు­న్న చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది మేమే 
‘2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్‌ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్‌ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్‌సీపీ మాత్రమే. 

అప్పుడు బీసీలకు పథకాలే పథకాలు.. 
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్‌ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్‌సీపీ.. ఓన్లీ జగన్‌ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్క»ొడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. ఈ పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్లు అంటూ ఇచ్చిన బాండ్లను చెత్తబుట్టలో పారేశారు. చంద్రబాబుదంతా మోసమే. నిజంగా బీసీలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి. 

బీసీలు ఎదుగుతుంటే బాబు చూడలేరు 
రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేక అక్రమ కేసులతో జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. యాక్సిడెంట్‌ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్య­కార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టి, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమా­ర్‌ను జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలే దాడు­లు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అది చేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి.. ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్‌ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమవుంటే ఇవన్నీ చేస్తా­డా? విశాఖలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళితే అందులో ఆరుగురు చనిపోతే, కనీసం వారిని చూడటానికి స్థానిక మంత్రి కూడా వెళ్లలేదు. ఈ­యన బీసీల గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన లేక చదవులు మానేస్తున్న వారిలో అత్యధికులు బీసీలే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరి హయా­ంలో బీసీలు బాగుపడ్డారో అందరూ ఆలోచించాలి.

34% రిజర్వేషన్లకు మించి బీసీలకు పదవులు ఇచ్చాం
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.
⇒ మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రి పదవులు బీసీలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్‌ రాజ్యసభకు పంపారు. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. 
⇒ చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేము 25 లోక్‌సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. అంటే 48 శాతం వారికే. 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవుల్లో 6 అంటే 46 శాతం బీసీలకే. 13 మేయర్‌ పదవుల్లో 9 అంటే 69 శాతం బీసీలకే. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38 శాతం బీసీలకే. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు 84లో 44 అంటే శాతం బీసీలకే.

⇒ 639 జెడ్పీటీసీల్లో 227 అంటే 36 శాతం బీసీలకే. 8,239 ఎంపీటీసీల్లో 3,361 అంటే 41 శాతం మంది బీసీలే. 10,536 సర్పంచుల్లో దాదాపు 4 వేల మంది బీసీలే. అంటే 38 శాతం వారికే. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవులు 196లో 76 అంటే 39 శాతం బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు 137లో 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37 శాతం ఇచ్చాం. 
⇒ 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని కార్పొరే­షన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు కలలో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్‌ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇచ్చాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి. 
⇒ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ప్రైవేట్‌ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ కోసం కూడా డిమాండ్‌ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement